ఆప్‌ కార్యాలయంలో పోలీసుల సోదాలు!

ABN , First Publish Date - 2022-09-13T10:31:06+05:30 IST

గుజరాత్‌లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కార్యాలయంలో ఆదివారం సాయంత్రం స్థానిక పోలీసులు సోదాలు జరిపారు.

ఆప్‌ కార్యాలయంలో పోలీసుల సోదాలు!

అహ్మదాబాద్‌, సెప్టెంబరు 12: గుజరాత్‌లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కార్యాలయంలో ఆదివారం సాయంత్రం స్థానిక పోలీసులు సోదాలు జరిపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ గుజరాత్‌ శాఖ వెల్లడించింది. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రెండు రోజుల పర్యటనకురాష్ట్రంలో అడుగు పెట్టినరోజే ఈ దాడులు జరిగాయని తెలిపింది. అయితే ఆప్‌ ప్రకటనను పోలీసులు ఖండించారు. తాము ఎటువంటి సోదాలూ జరపలేదన్నారు. గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆటోడ్రైవర్లు, డాక్టర్లు, లాయర్లతో సమ్మేళనాలు నిర్వహించేందుకు కేజ్రీవాల్‌ ఆదివారం అహ్మదాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విక్రమ్‌ లల్తానీ అనే ఆటోడ్రైవర్‌.. కేజ్రీవాల్‌ను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించగా, వెంటనే ఆయన అంగీకరించాడు. భద్రతా కారణాలతో పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరికి కేజ్రీవాల్‌ ఆటోడ్రైవర్‌ ఇంటికి వెళ్లి అతనితో కలిసి భోజనం చేశారు.

Read more