mass wedding: గుజరాత్ లో 551 జంటలకు సామూహిక వివాహం

ABN , First Publish Date - 2022-11-07T06:24:26+05:30 IST

తల్లిదండ్రుల్లేని 551 మంది అనాథ అమ్మాయిలకు ఆదివారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ లో సామూహిక వివాహ వేడుక జరిగింది....

 mass wedding: గుజరాత్ లో 551 జంటలకు సామూహిక వివాహం
mass wedding

భావ్‌నగర్ (గుజరాత్): తల్లిదండ్రుల్లేని 551 మంది అనాథ అమ్మాయిలకు ఆదివారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ లో సామూహిక వివాహ వేడుక జరిగింది. భావ్‌నగర్ జవహర్ మైదానంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వివాహ వేడుక(mass wedding event) కన్నుల పండువగా సాగింది. ఈ సామూహిక వివాహ వేడుకకు(mass wedding) ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ముఖ్యఅతిథిగా వచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహా వేడుకలకు అనవసరమైన ఖర్చులు చేసుకోవద్దని ప్రధాని ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. ఆహార వ్యర్థాలను తగ్గించడంతోపాటు బయోడిగ్రేడబుల్ కిచెన్ వ్యర్థాల నుంచి పొడి వ్యర్థాలను వేరు చేయడం వంటి వాటి ద్వారా సమాజానికి సహాయం చేయాలని ఈ సందర్భంగా ప్రధాని నూతన వధూవరులను(newly-weds) కోరారు.బంధువుల ఒత్తిడితో విడిగా వివాహ వేడుకలను నిర్వహించవద్దని, దీనికి బదులుగా ఆ డబ్బును పిల్లల కోసం పొదుపు చేయాలని ప్రధాని మోదీ నూతన వధూవరులను కోరారు.‘‘గుజరాత్(Gujarat) క్రమంగా ఈ సామూహిక వివాహాల ఆచారాన్ని అవలంబించాలి. ఇంతకుముందు ప్రజలు గొప్ప ప్రదర్శన కోసం డబ్బును అప్పుగా తీసుకొని ఆడంబరంగా వివాహాలు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు. వారు ఇప్పుడు సామూహిక వివాహాల కార్యక్రమాలకు మారారు’’ అని మోదీ చెప్పారు. ఇలాంటి ఉదాత్తమైన ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి, ఇతరులను ప్రేరేపించడానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను ఇటువంటి సామూహిక వివాహ కార్యక్రమాలకు హాజరయ్యానని ప్రధాని చెప్పారు.‘‘అప్పట్లో నేను జంటలకు ఇచ్చే సలహానే మళ్లీ మళ్లీ చెప్పాలనుకుంటున్నా.. చాలాసార్లు బంధువుల ఒత్తిడితో సామూహిక వివాహ కార్యక్రమంలో పెళ్లిపీటలు ఎక్కి విడివిడిగా వేడుకలు నిర్వహిస్తుంటారు.. దయచేసి అలా చేయకండి. మీ దగ్గర అదనపు డబ్బు ఉంటే, మీ పిల్లల భవిష్యత్తు కోసం దాన్ని ఆదా చేయండి’’ అని మోదీ సూచించారు.

Updated Date - 2022-11-07T06:24:26+05:30 IST

Read more