Sonia Gandhi Birthday: శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-12-09T11:06:50+05:30 IST

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 76వ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఆమెకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు ..

Sonia Gandhi Birthday: శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) 76వ పుట్టినరోజు (Birthday) వేడుక సందర్భంగా ఆమెకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోనియాగాంధీ మరిన్ని వసంతాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రధాని శుక్రవారంనాడు ఒక ట్వీట్‌లో అభిలషించారు.

రాజస్థాన్‌లో సోనియాగాంధీ..

సోనియాగాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీతో కలిసి రాజస్థాన్‌లో ఉన్నారు. తన 76వ పుట్టినరోజును రాహుల్, ప్రియాంక గాంధీ వాద్రా మధ్య రణ్‌థంబోర్‌లోని తమ కుటుంబ సన్నిహితులకు చెందిన రిసార్ట్‌లో జరుపుకోనున్నారు. కాగా, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ కలిసి ఈనెల 10వ తేదీన భారత్ జోడో యత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా మహిళలు ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. సోనియాగాంధీ బర్త్‌డే వేడుకను కుటుంబ వేడుకగా జరిపేందుకు ఫ్యామిలీ సభ్యులు ప్లాన్ చేస్తుండగా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారంనాడు రణ్‌థంబోర్ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-12-09T11:08:44+05:30 IST