Gujarat: కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారి ఇచ్చిన మోదీ

ABN , First Publish Date - 2022-09-30T22:34:50+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో రెండు రోజు పర్యటన..

Gujarat: కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారి ఇచ్చిన మోదీ

గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన స్వరాష్ట్రమైన గుజరాత్‌ (Gujarat)లో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. శుక్రవారంనాడు తన పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌ నుంచి గాంధీనగర్ వెళ్తుండగా ఒక అంబులెన్స్‌ (Ambulance)కు మార్గం సుగమం చేసేందుకు ప్రధాని స్వయంగా తన కాన్వాయ్‌ను ఆపేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియోను  బీజేపీ ప్రతినిధి  డాక్టర్ రుత్విజ్ పటేల్ ట్వీట్ చేశారు. ''మోదీ శకంలో వీఐపీ కల్చర్‌కు తావులేదు'' అని ఆయన ఆ ట్వీట్‌లో తెలిపారు. అహ్మదాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రం సమీపంలో మధ్యాహ్నం జరిగిన బహిరంగ సభను ముగించుకుని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు మోదీ  వెళ్తుండగా తాజా ఘటన చోటుచేసుకుంది.


మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశను కూడా  ప్రారంభించారు. సాయంత్రం బనస్‌కాంత్ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొంటారు.  ప్రఖ్యాత అంబాజీ దేవాలయంలో హారతికి హాజరవుతారు.

Read more