పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి షాకిచ్చిన చిన్నారి

ABN , First Publish Date - 2022-07-28T02:42:49+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహనా ఫిరోజియా అనే ఓ ఎనిమిదేళ్ల చిన్నారి షాకిచ్చింది.

పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి షాకిచ్చిన చిన్నారి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహనా ఫిరోజియా అనే ఓ ఎనిమిదేళ్ల చిన్నారి షాకిచ్చింది. తన తండ్రి, బీజేపీ ఎంపీ అయిన అనిల్ ఫిరోజియా వెంట పార్లమెంట్‌కు వచ్చిన చిన్నారి ప్రధాని మోదీని కలిసింది. చిన్నారిని దగ్గరకు తీసుకున్న ప్రధాని తానెవ్వరో చెప్పమని అడిగారు. మోదీ అని చిన్నారి కరెక్ట్‌గానే చెప్పింది. ఆ తర్వాత తాను ఏం చేస్తుంటానో చెప్పమని మోదీ అడిగారు. మీరు లోక్‌సభ టీవీలో పనిచేస్తుంటారు కదా అని రిప్లై ఇచ్చింది. దీంతో మోదీ గట్టిగా నవ్వేశారు. ఆ తర్వాత మోదీ చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి పంపారు.  అనిల్ ఫిరోజియా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైన్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. బరువు తగ్గితే నియోజకవర్గానికి ఒక్కో కేజీకి వెయ్యి కోట్ల రూపాయలిస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. కసరత్తులు చేసి 21 కిలోల బరువు తగ్గడంతో 21 వేల కోట్ల రూపాయల నిధులు కటాయించారు. 

Read more