తమిళనాడు గవర్నర్‌ను తొలగించాలని పిల్‌

ABN , First Publish Date - 2022-11-30T02:43:47+05:30 IST

ప్రజల సంక్షేమం కోసం తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన పథకాలకు సంబంధించిన బిల్లులకు మోకాలడ్డుతూ రాష్ట్రాభివృద్ధికి ఆటంకంగా మారిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌. రవిని తొలగించాలని అభ్యర్థిస్తూ మద్రాస్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది.

తమిళనాడు గవర్నర్‌ను తొలగించాలని పిల్‌

చెన్నై, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షేమం కోసం తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన పథకాలకు సంబంధించిన బిల్లులకు మోకాలడ్డుతూ రాష్ట్రాభివృద్ధికి ఆటంకంగా మారిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌. రవిని తొలగించాలని అభ్యర్థిస్తూ మద్రాస్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ‘తందై పెరియార్‌ ద్రావిడర్‌ కళగం’ కాంచీపురం జిల్లా కార్యదర్శి కన్నదాసన్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 2021 సెప్టెంబరు 18న రాష్ట్ర గవర్నర్‌గా ఆర్‌ఎన్‌. రవి బాధ్యతలు చేపట్టిన రోజునుంచే ఆయన సమస్యలకు కేంద్రబిందువుగా మారారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గవర్నర్‌ బహిరంగ వేదికలపై సనాతన ధర్మం, హిందుత్వ అజెండాను వల్లె వేస్తూ ద్రావిడ లక్ష్యాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2022-11-30T02:43:48+05:30 IST