అఫ్ఘాన్‌లో ‘పానిపట్‌’ సైనిక యూనిట్‌!

ABN , First Publish Date - 2022-02-16T06:38:17+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ల సర్కారు ‘పానిపట్‌’ పేరిట ప్రత్యేక మిలిటరీ

అఫ్ఘాన్‌లో ‘పానిపట్‌’ సైనిక యూనిట్‌!

ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి 15: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ల సర్కారు ‘పానిపట్‌’ పేరిట ప్రత్యేక మిలిటరీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 1761లో అఫ్ఘాన్‌ రాజు అహ్మద్‌ షా దురానీ మూడో పానిపట్‌ యుద్ధంలో మరాఠా సైన్యాన్ని ఓడించిన సంగతి తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే ‘పానిపట్‌ ఆపరేషనల్‌ యూనిట్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే తాలిబాన్ల యుద్ధోన్మాదం అందరికీ తెలుసనని, వారు భారత్‌ను కవ్వించేందుకే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని సోషల్‌ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. తాలిబాన్లు ఈ ప్రత్యేక యూనిట్‌ను ఈశాన్య ప్రావిన్సులోని నంగార్హర్‌ (పాక్‌ సరిహద్దు) వద్ద మోహరించనున్నట్లు అఫ్ఘానిస్థాన్‌కు చెందిన ‘ఆమజ్‌ న్యూస్‌’ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 


Updated Date - 2022-02-16T06:38:17+05:30 IST