‘పాలమూరు’ ప్రతిపాదనలు స్వీకరించిన కేంద్రం

ABN , First Publish Date - 2022-09-08T08:11:13+05:30 IST

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను బుధవారం కేంద్ర ప్రభుత్వం పరిశీలనకు స్వీకరించింది.

‘పాలమూరు’ ప్రతిపాదనలు స్వీకరించిన కేంద్రం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను బుధవారం కేంద్ర ప్రభుత్వం పరిశీలనకు స్వీకరించింది. ఈ నెల 14న పర్యావరణ నిపుణుల కమిటీ (ఈఏసీ) భేటీలో ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. భేటీకి వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరు కావాలని రాష్ట్ర  నీటి పారుదల శాఖ అధికారులకు కేంద్ర పర్యావరణ శాఖ సమాచారం అందించింది. 

Read more