‘ఉక్రెయిన్ మెడికో’లకు ఇతర దేశాల్లో అవకాశం
ABN , First Publish Date - 2022-09-17T08:38:32+05:30 IST
‘ఉక్రెయిన్ మెడికో’లకు ఇతర దేశాల్లో అవకాశం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు ఇతర దేశాల్లో అవకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వివిధ దేశాల్లోని వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లు, ఫీజుల వివరాలను పొందుపరుస్తూ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రాం’ కింద ఈ పోర్టల్‌ను నిర్వహించాలని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధులియాల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకొని ఏ విషయం చెబుతానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. దాంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.