OTP విషయంలో గొడవ.. టెకీని హత్య చేసిన Ola Driver

ABN , First Publish Date - 2022-07-06T01:25:52+05:30 IST

వీకెండ్‌లో సరదాగా భార్యాపిల్లలను సినిమాకి వెంటబెట్టుకెళ్లిన ఓ వ్యక్తి.. ఓలా క్యాబ్ డ్రైవర్(Cab driver) చేతిలో చనిపోయాడు. చెన్నై(Chennai

OTP విషయంలో గొడవ.. టెకీని హత్య చేసిన Ola Driver

చెన్నై: వీకెండ్‌లో సరదాగా భార్యాపిల్లలను సినిమాకి వెంటబెట్టుకెళ్లిన ఓ వ్యక్తి.. ఓలా(Ola) క్యాబ్ డ్రైవర్(Cab driver) చేతిలో చనిపోయాడు. ఓటీపీ(One Time Password) విషయంలో తలెత్తిన ఘర్షణ విషాదంగా మారిన ఈ ఘటన తమిళనాడు(Tamilanadu)లోని చెన్నై(Chennai)లో ఆదివారం వెలుగుచూసింది. కోయంబత్తూరు(Coimbatore)లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఉమేంద్ర(Umendra) అనే వ్యక్తి వారాంతంలో భార్యాబిడ్డలతో సరదాగా గడపాలనుకున్నాడు. చెన్నైలోని బంధువుల ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లాడు. సంతోషంగా గడిపాక ఆదివారం ఇంటికి తిరుగుపయనంలో భార్యపిల్లలను సినిమా(Movie)కి తీసుకెళ్లాడు. 


సినిమా అయిపోయాక ఉమేంద్ర భార్య క్యాబ్(Cab) బుక్ చేసింది. బుక్ చేసిన ప్రాంతానికి క్యాబ్ చేరుకోవడం.. కారు ఎక్కడం జరిగిపోయాయి. అయితే ఓటీపీ విషయంలో భార్యభర్తలు తికమకపడ్డారు. దీంతో డ్రైవర్ విసిగించుకున్నాడు. ఓటీపీ సరిగా చెప్పండి.. లేదంటే క్యాబ్ దిగిపోండి.. అని డ్రైవర్ వారించాడు. డ్రైవర్ తీరుతో ఉమేంద్ర కుటుంబం కోపంగా కారు దిగారు. అయితే దిగే క్రమంలో కారు డోరుపై ఉమేంద్ర బలం ప్రయోగించాడు. డోర్‌ని బలంగా వేయడంతో క్యాబ్ డ్రైవర్, ఉమేంద్ర మధ్య వివాదం మొదలైంది. మాటామాటా పెరగడంతో ఉమేంద్రపై డ్రైవర్ తన సెల్‌ఫోన్‌ని విసిరాడు. ఆ తర్వాత కారుదిగొచ్చి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అనూహ్య దాడితో భార్యబిడ్డల ముందే ఉమేంద్ర కూలబడ్డాడు. హుటాహుటిన సమీపంలోని హాస్పిటల్‌కు తరలించినా ప్రయోజనం దక్కలేదు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో నిందిత డ్రైవర్‌పై మర్డర్ కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని చెన్నై పోలీసులు(Chennai Police) వెల్లడించారు.

Updated Date - 2022-07-06T01:25:52+05:30 IST