రాజ్‌పథ్ పేరు మార్పుపై అధికారిక ప్రకటన వచ్చేసింది..

ABN , First Publish Date - 2022-09-07T19:23:28+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే రాజ్‌పథ్(Rajpath) పేరును కేంద్రం మార్చేసింది.

రాజ్‌పథ్ పేరు మార్పుపై అధికారిక ప్రకటన వచ్చేసింది..

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే రాజ్‌పథ్(Rajpath) పేరును కేంద్రం మార్చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో వలసవాద విధానాలు, చిహ్నాలను మార్చుతున్నామని కేంద్రం(Central Government) ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్‌(Karthavyapath)గా మార్చుతున్నట్టు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి(Minakshi Lekhi) ప్రకటించారు. సెంట్రల్‌ విస్టా(Central Vista) మార్పుల్లో భాగంగా... విజయ్‌ చౌక్‌(Vijay Chowk) నుంచి ఇండియా గేట్‌(India Gate) వరకూ కేంద్రం పలు మార్పులు చేసింది. సుమారు ఏడాదిన్నరగా రాజ్‌పథ్‌లో ప్రజల సందర్శనను అధికారులు నిషేధించారు. అభివృద్ది పనులు పూర్తైన తదుపరి రేపు సాయంత్రం ప్రధాని మోదీ(PM Modi) లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో... రాజ్‌పథ్‌ పేరు మార్పును కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి అధికారికంగా ప్రకటించారు.


Read more