అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో Rahul పర్యటన

ABN , First Publish Date - 2022-07-21T15:58:23+05:30 IST

కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేపట్టనున్న రాహుల్‌గాంధీ రాష్ట్రంలో అక్టోబరు 2,3,4 తేదీల్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్‏ను బలోపేతం

అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో Rahul పర్యటన

ఐసిఎఫ్‌(చెన్నై), జూలై 20: కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేపట్టనున్న రాహుల్‌గాంధీ రాష్ట్రంలో అక్టోబరు 2,3,4 తేదీల్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్‏ను బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ కన్నియాకుమారి నుంచి 3,500 కి.మీ మేర 148 రోజులు పాదయాత్ర చేపట్టనున్నారు. అక్టోబరు 2వ తేది గాంధీ జయంతి రోజున కన్నియాకుమారి గాంధీ స్మారక మందిరంలో నివాళులర్పించనున్నారు. రెండు రోజులు ఆ జిల్లాలో పర్యటించి మూడోరోజు కళియకావిలై నుంచి తిరువనంతపురం వెళ్లనున్నారు. కేరళ రాష్ట్రంలోని ఆయన నియోజకవర్గం వయనాడులో ఆయన పర్యటించనున్నారు.

Read more