సీజేఐ లేఖపై న్యాయమూర్తుల అభ్యంతరం

ABN , First Publish Date - 2022-10-05T09:46:39+05:30 IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంపై మరో వివాదం మొదలైంది. నలుగురు న్యాయమూర్తుల నియామకానికి సమ్మతి కోరుతూ

సీజేఐ లేఖపై న్యాయమూర్తుల అభ్యంతరం

న్యూఢిల్లీ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంపై మరో వివాదం మొదలైంది. నలుగురు న్యాయమూర్తుల నియామకానికి సమ్మతి కోరుతూ కొలీజియం సభ్యులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ లేఖ రాయడం పట్ల ఇద్దరు న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి ఈ గత నెల 30న కొలీజియం భేటీ అవ్వాల్సి ఉండగా జస్టిస్‌ డీవై చంద్రచుడ్‌ ఆ రోజు రాత్రి 9 గంటల వరకు కేసుల విచారణ జరిపారు. ఆ కారణంగా కొలీజియం సమావేశం జరగలేదు.  ఆ మరుసటి రోజు సీజేఐ కొలీజియం సభ్యులకు లేఖ రాశారు.

Read more