Former Chief Minister: సీఎంకు ఓపీఎస్‌, ఆయన తనయుడి ప్రశంస

ABN , First Publish Date - 2022-09-07T13:18:14+05:30 IST

ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థినులకు ప్రతినెలా రూ.1000లు చెల్లించే ‘పుదుమైపెణ్‌’ పథకం పట్ల అన్నాడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి

Former Chief Minister: సీఎంకు ఓపీఎస్‌, ఆయన తనయుడి ప్రశంస

చెన్నై, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థినులకు ప్రతినెలా రూ.1000లు చెల్లించే ‘పుదుమైపెణ్‌’ పథకం పట్ల అన్నాడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam), ఆయన తనయుడు లోక్‌సభ సభ్యుడు రవీంద్రనాధ్‌ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం మదురై విమానాశ్రయంలో ఓపీఎస్‌ మీడియాతో మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వం ‘పుదుమై పెణ్‌’ పథకం’ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ పథకం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని, పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఈ సందర్భంగా ఆయన అభినందలు తెలియజేశారు. ఇదిలా ఉండగా పళని దండాయుధపాణిస్వామివారిని దర్శించిన అనంతరం ఎంపీ రవీంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘పుదుమై పెణ్‌’ ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మనసారా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దటానికి ఉచిత లాప్‌టాప్ లు, సైకిళ్ల పంపిణీ వంటి పథకాలు అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. అన్నాడీఎంకే నుంచి విడిపోయిన దినకరన్‌, శశికళ(Dhinakaran, Sasikala) తదితర నాయకులంతా మళ్ళీ పార్టీలో విలీనం కావాలని పార్టీ సమన్వయకర్త ఒ. పన్నీర్‌సెల్వం ఆశిస్తున్నారని, తానుకూడా అందరూ కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి పాటుపడాలని, వచ్చే ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేయాలని కోరుకుంటున్నానని రవీంద్రనాధ్‌ చెప్పారు.

Updated Date - 2022-09-07T13:18:14+05:30 IST