Notification: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-09-22T18:59:51+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్‌ (Notification) విడుదలైంది.

Notification: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

ఢిల్లీ (Delhi): కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్‌ (Notification) విడుదలైంది. ఈ నెల 24 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబరు 1న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అక్టోబరు 8గా నిర్ణయించారు. పోటీలో ఒకరు కంటే ఎక్కువ మంది ఉంటే అక్టోబరు 17న ఎన్నిక జరుగుతుంది. 19న ఫలితాలు విలువడనున్నాయి.

 

కాంగ్రెస్ పార్టీ బాధ్యతల స్వీకరణకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) విముఖత చూపడంతో ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్‌ గెహ్లాత్ (Ashok Gehlot)‌, శశిథరూర్‌ (Shashi Tharoor)బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. కాగా అధ్యక్ష ఎన్నికల్లో 9వేల మంది ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా నిన్న (బుధవారం) సోనియా గాంధీ (Sonia Gandhi)తో రాజస్తాన్ సీఎం అశోక్‌ గెహ్లాత్‌ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.


పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు తాను స్వీకరించనని ఇప్పటికే రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీంతో పార్టీ కోరుకుంటే అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తానని గెహ్లాత్ ప్రకటించారు. 1998 తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా సీతారాం కేసరిని ఎన్నుకున్న నేతలు.. మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఎన్నికలు అనివార్యమవుతున్నాయి.

Updated Date - 2022-09-22T18:59:51+05:30 IST