ఉత్తర కర్ణాటక ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రమే...

ABN , First Publish Date - 2022-06-23T18:35:03+05:30 IST

ఉత్తర కర్ణాటక ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రమేనని ఇందులో సందేహమే లేదని ఇది బీజేపీ నిర్ణయం కాదని నా వ్యక్తిగతమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి

ఉత్తర కర్ణాటక ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రమే...

- 2024 తర్వాత దేశంలో 50 కొత్త రాష్ట్రాలు 

- అటవీశాఖ మంత్రి ఉమేశ్‌కత్తి 


బెంగళూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఉత్తర కర్ణాటక ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రమేనని ఇందులో సందేహమే లేదని ఇది బీజేపీ నిర్ణయం కాదని నా వ్యక్తిగతమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఉమేశ్‌కత్తి వెల్లడించారు. బెళగావిలో బుధవారం న్యాయవాదులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరిన్ని రాష్ట్రాలను విభజించనున్నారన్నారు. మహారాష్ట్రను మూడుగాను, కర్ణాటకను రెండుగాను, ఉత్తరప్రదేశ్‌ను నాలుగుగాను మారుస్తారన్నారు. తద్వారా దేశంలో 50 రాష్ట్రాలు కానున్నాయన్నారు. ఇప్పటికే చర్చలు సాగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చూస్తా రన్నారు. బెంగళూరు కథ ముగి సిందని, నా నివాసం నుంచి విధాన సౌధకు వెళ్లాలంటే 10 కిలోమీటర్ల దూరం ఉందని కానీ గంటన్నరకుపైగా సమయం పడుతుందన్నారు. ఇది ఇక్కడి ట్రాఫిక్‌ పరిస్థితి అన్నారు. ఐటీ, బీటీ, పరిశ్రమలు పెరిగి రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తలెత్తవచ్చునన్నారు. 

Read more