Nobel prize: భౌతికశాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ పురస్కారం

ABN , First Publish Date - 2022-10-04T21:54:30+05:30 IST

భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం(Nobel prize) ముగ్గురిని వరించింది. ఫోటాన్లలో చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో

Nobel prize: భౌతికశాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ పురస్కారం

స్టాక్‌హోం: భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం(Nobel prize) ముగ్గురిని వరించింది. ఫోటాన్లలో చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో చేసిన ప్రయోగాలకు గాను అలైన్ ఆస్పెక్ట్(Alain Aspect), జాన్ ఎఫ్. క్లాజర్ (John Clauser), ఆంటోన్ జైలింగర్‌(Anton Zeilinger)లకు ప్రపంచంలోనే అత్యత్తున పురస్కారం లభించింది. ఈ ముగ్గురు గ్రహీతలు క్వాంటం స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలు నిర్వహించారు. రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్‌గా ప్రవర్తిస్తాయి. ఈ పరిశోధన ఫలితాలు క్వాంటం సమాచారం ఆధారంగా సరికొత్త సాంకేతికతకు మార్గాన్ని క్లియర్ చేశాయి.  


భౌతిక శాస్త్రంలో గతేడాది కూడా ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి దక్కడం గమనార్హం. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకు గాను సుకురో మనాబే, క్లాస్ హలిస్‌మన్, జార్జియో పారిసీలకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం లభించింది. కాగా, జార్జియో పారసీకి సగం పురస్కారాన్ని అందించగా, మిగతా సగాన్ని మనాబే, హలిస్‌మన్‌లు పంచుకున్నారు. నోబెల్ బహుమతి ప్రకటనలు సోమవారం నుంచి ప్రారంభం కాగా, తొలి రోజు వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు.


వైద్యశాస్తంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది స్వాంటె పాబో(svante pääbo)కు నోబెల్ పురస్కారం లభించింది. మానవ పరిణామ క్రమం, అంతరించి పోయిన హొమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు ఆయనకీ(svante pääbo) పురస్కారం లభించింది. అంతరించిపోయిన నియాండెర్తల్ జన్యువును పాబో(svante pääbo) సీక్వెన్స్‌తో పాటు గతంలో ఎవరికీ తెలియని హోమినిన్ డెనిసోవాకు సంబంధించి సంచలనాత్మక ఆవిష్కరణ చేశారు.


దాదాపు 70 వేల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన తర్వాత ప్రస్తుతం అంతరించిపోయిన ఈ హోమినిన్‌ల నుంచి హోమో సేపియన్లకు జన్యు బదిలీ జరిగిందని పాబో(svante pääbo) కనుగొన్నారు. ఫలితంగా నేటి మానవుల్లోనూ ఈ పురాతన జన్యువుల ప్రవాహం కొనసాగుతోంది. ఇది మన రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంటువ్యాధులకు ప్రతిస్పందిస్తుంది. పాబో(svante pääbo) సెమినల్ పరిశోధన  పూర్తిగా నూతన శాస్త్రీయ డిసిప్లిన్‌ పాలియోజెనోమిక్స్‌కు దారితీసినట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది. స్వాంటె పాబో(svante pääbo) ప్రస్తుతం జర్మనీలోని ‘మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీ’ డైరెక్టర్‌గా ఉన్నారు.


నోబెల్ పురస్కార (Nobel Prize) గ్రహీతలకు గోల్డ్ మెడల్, 10 మిలియన్ల స్వీడిష్ క్రోనోర్ (దాదాపు 1.14 మిలియన్ డాలర్లు) అందజేస్తారు. 1896లో మరణించిన స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్ ఆల్ఫ్రెడ్ నోబెల్(Alfred Nobel) పేరు మీదుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందిస్తున్న వారికి నోబెట్ బహుమతి(Nobel Prize)ని ప్రదానం చేస్తున్నారు. కాగా, రేపు(బుధవారం)   రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, శుక్రవారం ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి(Nobel Prize) పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. 

Updated Date - 2022-10-04T21:54:30+05:30 IST