నిధుల కోసమే పెకిలించారు...

ABN , First Publish Date - 2022-06-07T17:32:55+05:30 IST

చారిత్రక నగరం హంపీ సమీపంలోని పాసరోవరం వద్ద విజయలక్ష్మి దేవి విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు పెకిలించివేశారు. రాయల

నిధుల కోసమే పెకిలించారు...

- విజయలక్ష్మి విగ్రహ స్థానమార్పుపై స్థానికుల ఆగ్రహం

- దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌


బళ్లారి(బెంగళూరు), జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): చారిత్రక నగరం హంపీ సమీపంలోని పాసరోవరం వద్ద విజయలక్ష్మి దేవి విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు పెకిలించివేశారు. రాయల పాలనలో విగ్రహాల కింద వజ్రాలు దాచారని ఇక్కడ ప్రతీతి. నిధుల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విగ్రహ ధ్వంసంపై గంగావతి, ఆ నేగొంది సమీప గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంపాసరోవరం వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పనిలో పనిగా గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి పక్కన పెట్టారు. విగ్రహం కింద 5 అడుగుల లోతు వరకు తవ్వారు. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే సీసీ కెమరాలు ధ్వంసం చేసి, క్షుద్రపూజలకు పాల్పడ్డారని స్థానికులు వెల్లడించారు. విగ్రహం దాని వాస్తవ స్థానం నుంచి కదిలాక తిరిగి పూర్వ జీవం పొం దాలంటే తిరిగి పూజలు చేసి తిరిగి జీవం పోసిన తరువాత విగ్రహన్ని ప్రతిష్టించాలి. కానీ అలా కాకుండా విగ్రహన్ని హడావుడిగా ప్రతిష్టించాలని పురావస్తు శాఖ ఆలోచిస్తున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు. పూజలు చే యకుండా విగ్రహాన్ని ప్రతిష్టించరాదని అంటున్నారు.


గతంలోనూ విగ్రహాల విధ్వంసం

గతంలో కూడా అనేక సమయాల్లో గుప్త నిధుల కోసం దుండగులు అత్యత ప్రాచీన విగ్రహాలు ద్వంసం చేశారు. నది మధ్యలో ఉండే రాఘవేద్రస్వామి గురువుల జీవ సమాధులనూ పెకిలించారు. నిధుల కోసం జీవసమాధులను ద్వంసం చేయడంపై స్థానికులు, పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, నేతలు ఇప్పటికైనా చర్యలు తీసుకుని చారిత్రక స్థలాలను కాపాడాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2022-06-07T17:32:55+05:30 IST