Chhagan Bhujbal: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఎన్‌సీపీ నేత

ABN , First Publish Date - 2022-11-07T15:22:19+05:30 IST

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్‌బల్ అస్వస్థతకు గురయ్యారు. 75 ఏళ్ల భుజ్‌బల్ ముంబై‌లోని ఆసుపత్రిలో సోమవారంనాడు చేరారు. వైరల్ ..

Chhagan Bhujbal: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఎన్‌సీపీ నేత

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్‌బల్ (Chhagan Bhujbal) అస్వస్థతకు గురయ్యారు. 75 ఏళ్ల భుజ్‌బల్ ముంబై‌లోని ఆసుపత్రిలో సోమవారంనాడు చేరారు. వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఇంట్లోనే వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స తీసుకున్న భుజ్‌బల్ షిర్డీలో జరిగిన పార్టీ క్యాంపులో పాల్గొన్నారు. అయితే, ఈరోజు ఉదయం ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రం కావడంతో ముంబై ఆసుపత్రిలో చేరారు.

ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సైతం ఆరోగ్య కారణాలతో అక్టోబర్ 31న బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఆయన డిశ్చార్చ్ అవుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ షిర్డీలో జరిగిన ఎన్‌సీపీ క్యాంప్‌కు ఆయన హాజరయ్యారు. వైద్యుల బృందంతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో షిర్డీ వెళ్లి పార్టీ క్యాంపులో పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T15:22:19+05:30 IST

Read more