మానవత్వం మరచి.. మత్తుమందు ఇచ్చి...

ABN , First Publish Date - 2022-09-28T17:08:11+05:30 IST

మనిషి మృగంలా మారుతున్నాడు.. మానవత్వం మరచి దారుణాలకు పాల్పడున్న ఘటనలనూ చూస్తూనే ఉన్నాం.. అయితే అలాంటి మనుషులు జంతువులను సై

మానవత్వం మరచి.. మత్తుమందు ఇచ్చి...

బళ్లారి(బెంగళూరు): మనిషి మృగంలా మారుతున్నాడు.. మానవత్వం మరచి దారుణాలకు పాల్పడున్న ఘటనలనూ చూస్తూనే ఉన్నాం.. అయితే అలాంటి మనుషులు జంతువులను సైతం వదలకుండా వేధించి చంపడం.. దిగజారిన మానవత్వ విలువలకు అద్దం పడుతోంది. కోతులకు మత్తుమందు ఇచ్చి చింతచెట్లకు ఉరివేసిన ఘటన బీదర్‌ జిల్లా పరిధిలోని మురాళ గ్రామంలో చోటు చేసుకుంది. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా నాలుగు కోతులను మత్తుమందు ఇచ్చి చంపేయడం మంగళవారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఘటనా స్థలానికి నిట్టూరు పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కోతుల సామూహిక హత్యను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్‌ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more