నాగాలాండ్‌ డీజీపీ నియామకంలో జాప్యం

ABN , First Publish Date - 2022-12-10T01:09:40+05:30 IST

నాగాలాండ్‌ డీజీపీ నియామకంపై జాప్యం చేస్తున్నందుకు యూపీఎ్‌ససీని శుక్రవారం సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ నెల 19లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ నియామకాన్ని పూర్తి

నాగాలాండ్‌ డీజీపీ నియామకంలో జాప్యం

యూపీఎస్‌సీని నిలదీసిన సుప్రీంకోర్టు.. 19దాకా గడువు

న్యూఢిల్లీ, డిసెంబరు 9: నాగాలాండ్‌ డీజీపీ నియామకంపై జాప్యం చేస్తున్నందుకు యూపీఎ్‌ససీని శుక్రవారం సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ నెల 19లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ నియామకాన్ని పూర్తి చేయాలంటూ స్పష్టమైన గడువు విధించింది. కేంద్ర హోం శాఖతో సంప్రదింపులు జరుగుతున్నాయని, మరో 60 రోజుల సమయం ఇవ్వాలంటూ యూపీఎ్‌ససీ చేసిన వినతిని తిరస్కరించింది. డీజీపీ పదవికి అర్హులైన అధికారుల జాబితాను అక్టోబరు 31లోగా పంపాలని నాగాలాండ్‌ ప్రభుత్వాన్ని, దానిపై నవంబరు 30లోగా నిర్ణయం తీసుకోవాలని యూపీఎ్‌ససీని గతంలోనే ఆదేశించింది. ఆ ఆదేశాలు అమలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

Updated Date - 2022-12-10T01:09:45+05:30 IST