2024 వరకు నడ్డానే బీజేపీ అధ్యక్షుడు?

ABN , First Publish Date - 2022-09-27T07:47:12+05:30 IST

లోక్‌సభ ఎన్నికలు ముగిసే దాకా జేపీ నడ్డానే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.

2024 వరకు నడ్డానే బీజేపీ అధ్యక్షుడు?

పార్టీ కేంద్ర నాయకత్వం యోచన 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: లోక్‌సభ ఎన్నికలు ముగిసే దాకా జేపీ నడ్డానే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. వరుసగా ఎన్నికలు ఉండటమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది తెలంగాణతో పాటు కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, మిజోరం, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తర్వాతి ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు. వరుస ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్షుడి మార్పు సరికాదని పార్టీ భావిస్తోంది. అంతే కాకుండా విజయాల పరంగా పార్టీ అధ్యక్షుడిగా నడ్డాకు మంచి రికార్డు ఉంది. దీంతో నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగించాలని పార్టీ భావిస్తోంది. 2020 జనవరిలో నడ్డా అధ్యక్షుడిగా అమిత్‌ షా నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పదవీకాలం 2023 జనవరి 20తో ముగియనుంది. 

Updated Date - 2022-09-27T07:47:12+05:30 IST