‘పుర’ పోరుకు రేపే నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-01-23T13:37:44+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా నగర పాలక (కార్పొరేషన్లు), పురపాలక (మున్సిపాలిటీలు), పట్టణ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ ఎన్నికలకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫి కేషన్‌ విడుదల చేసే

‘పుర’ పోరుకు రేపే నోటిఫికేషన్‌

                            - ప్రచారానికి కఠిన ఆంక్షలు?

                            - రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం 


అడయార్‌(చెన్నై): రాష్ట్ర వ్యాప్తంగా నగర పాలక (కార్పొరేషన్లు), పురపాలక (మున్సిపాలిటీలు), పట్టణ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ ఎన్నికలకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫి కేషన్‌ విడుదల చేసే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. అదేసమ యంలో ఎన్నికల ప్రచారానికి కఠిన ఆంక్షలను విధించనుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం లో మొత్తం 21 కార్పొరేషన్లు, 138 మున్సిపాలి టీలు, 490 పట్టణ పంచాయతీలున్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 2019 , డిసెంబరు 24న రాష్ట్రంలో 24 జిల్లాలకు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 జిల్లాలకు నిర్వహించలేదు. ఈ జిల్లాల ఏర్పాటు ప్రక్రి య, సరిహద్దుల ఖరారు తేలిన తర్వాత గత యేడాది అక్టోబరులో రెండు దశల్లో ఎన్నికలు నిర్వ హించారు. వీటిలో మెజార్టీ స్థానాలను అధికార డీఎంకే కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంల జనవరి 31లోగా రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి తీరాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే ఏర్పాట్లులో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమెంది. 


ఒకే దశలో ఎన్నికలు

ఈ ఎన్నికల నిర్వహణపై అఖిలపక్ష భేటీని ఎన్నికల సంఘం నిర్వహించింది. ఈ సమావేశంలో అన్ని పార్టీల నేతలు ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించాలని కోరారు. దీంతో ఎన్నికల సంఘం కూడా అందుకు మొగ్గు చూపి, ఆ విధంగానే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. 


కోర్టు తీర్పు కోసం ఎదురుచూపు 

ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ సోమవారం ఈ ఎన్నికలకు సంబందించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబందించిన కేసులో సోమవారం కోర్టు తీర్పు వెల్లడించనుంది. దాని ఆధారంగా నోటిఫికేషన్‌ విడుదల చేయవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందున ఈ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయాలంటూ మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. దీనిపై కూడా ఈ నెల 24న తీర్పు వెల వడనుంది. ఈ రెండు తీర్పులను పరిశీలించిన మేరకు ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


పెరిగిన డిపాజిట్‌

ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్‌ మొత్తాన్ని ఎన్నికల సంఘం పెంచింది. కార్పొరేషన్‌ వార్డు మెంబరుకు పోటీ చేసే అభ్యర్థి రూ.4 వేలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే, మున్సిపాలిటీ వార్డు మెంబరుకు రూ.2 వేలు, పట్టణ పంచాయతీ వార్డు మెంబరుకు రూ.1,000 చొప్పున డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అదేసమయంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం ఈ మొత్తంలో సగం చెల్లిస్తే సరిపోతుంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారం చేయడానికి విల్లేదు. ముఖ్యంగా, పార్టీ పేరుమీద లేదా అభ్యర్థి పేరుమీద బ్యానర్లు, డిజిటల్‌ కటౌట్లు, వాల్‌పోస్లర్లు ముద్రించకూడదని సూచించింది. ఎన్నికల ప్రచారంలో లౌడ్‌ స్పీకర్లను ఉపయోగించడానికి వీల్లేదు. అలాగే, ఎన్నికల ప్రచారానికి విధించే నియమనిబంధనలను నోటిఫికేషన్‌ తర్వాత వెల్లడిస్తారని ఈసీ వర్గాలు వెల్లడించాయి. 

Read more