దేశవ్యాప్తంగా మళ్లీ వేలాది కరోనా కేసులు నమోదు.. పెరుగుతున్న ఆందోళన

ABN , First Publish Date - 2022-01-04T02:41:21+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. ఒమైక్రాన్ ప్రభావంతో అన్ని రాష్ట్రాల్లో వేలాది..

దేశవ్యాప్తంగా మళ్లీ వేలాది కరోనా కేసులు నమోదు.. పెరుగుతున్న ఆందోళన

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. ఒమైక్రాన్ ప్రభావంతో అన్ని రాష్ట్రాల్లో వేలాది కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. చండీగఢ్‌ కూడా ఆంక్షలు విధించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం రెండు వారాలపాటు భౌతిక విచారణలకు స్వస్తి చెప్పింది. పశ్చిమ బెంగాల్‌లో నేడు కొత్తగా 6,078 కేసులు నమోదు కాగా, ఒక్క కోల్‌కతాలోనే 2,801 కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీలో 4,099 కరోనా కేసులు నమోదయ్యాయి.


రాజస్థాన్‌లో నేడు 53 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 174కు పెరిగింది. తాజాగా నమోదైన 53 కొత్త కేసుల్లో 9 మంది విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన ఒకరు ఒమైక్రాన్ బారినపడ్డారు. గోవాలో నాలుగు కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజీత్ రాణే తెలిపారు. ముంబైలో రికార్డు స్థాయిలో 8,082 కేసులు వెలుగుచూశాయి. కర్ణాటకలో నేడు 1290 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.60 శాతానికి పెరిగింది.

Updated Date - 2022-01-04T02:41:21+05:30 IST