Mukesh ambani: ముకేష్ అంబానీ కుటుంబానికి మళ్లీ బెదిరింపు కాల్.. ఈసారి ఏమని బెదిరించారో తెలుసా..

ABN , First Publish Date - 2022-10-05T23:10:12+05:30 IST

దేశసంపన్నుల్లో ఒకరైన వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి (Mukesh ambani) మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

Mukesh ambani: ముకేష్ అంబానీ కుటుంబానికి మళ్లీ బెదిరింపు కాల్.. ఈసారి ఏమని బెదిరించారో తెలుసా..

ముంబై: దేశసంపన్నుల్లో ఒకరైన వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance industries) అధినేత ముకేష్ అంబానీ, ఆయన కుటుంబానికి (Mukesh ambani) మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కి గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ చేసిన దుండగుడు.. అంబానీని, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరించాడు. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ని పేల్చివేస్తామని హెచ్చరించాడు. బుధవారం (అక్టోబర్ 5) మధ్యాహ్నం 1:57 గంటలకు ఈ ఫోన్ వచ్చింది. కాగా హాస్పిటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా గతంలోనూ ముకేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆగస్టు 15న హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు ఫోన్ చేసి దుండగులు బెదిరించిన విషయం తెలిసిందే. కాగా కాల్ చేసిన వ్యక్తి దహిసర్‌ను పోలీసులు అదే రోజున గుర్తించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Read more