వరద సాయం కోసం కేంద్రంపై ఒత్తిడి

ABN , First Publish Date - 2022-01-03T18:27:21+05:30 IST

రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాలేదని డీఎంకే ఎంపీ టీకేఎస్‌ ఇళంగోవన్‌ అన్నారు.

వరద సాయం కోసం కేంద్రంపై ఒత్తిడి

 ఎంపీ ఇళంగోవన్‌ వెల్లడి

చెన్నై/అడయార్‌, జనవరి 2: రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాలేదని డీఎంకే ఎంపీ టీకేఎస్‌ ఇళంగోవన్‌ అన్నారు. ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాల ప్రభావం తో కురిసిన వర్షాలు, సంభవించిన వరదల కారణంగా రూ.6230 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేద న్నారు. ఇదే విషయంపై కేంద్రానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ పలుమార్లు లేఖలు రాశారన్నారు. గత నెల 29న కూడా సీఎం కేంద్రానికి లేఖరాయగా, మరుసటి రోజున కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో డీఎంకే ఎంపీలు సమా వేశమై నిధులు కేటాయించాల్సిందిగా కోరినట్టు ఆయన చెప్పారు. కానీ, కేంద్రం మాత్రం నిధులు విడుదల చేయలేదన్నారు. కానీ బీజేపీ అధికారం లో ఉన్న గుజరాత్‌, అస్సాం, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌తో పాటు సీఎం మమతా బెనర్జీ ఉన్న వెస్ట్‌ బెంగాల్‌కు మాత్రం రూ.3 వేల కోట్ల మేర  అదనపు నిధులను మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. 

Read more