ఎంపీ అరుణ్‌ కుమార్‌ పరారీలో ఉన్నారు

ABN , First Publish Date - 2022-11-24T01:40:11+05:30 IST

షాజహాన్‌పూర్‌ బీజేపీ ఎంపీ అరుణ్‌ కుమార్‌ సాగర్‌ పరారీలో ఉన్నారని ఇక్కడి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఎంపీ అరుణ్‌ కుమార్‌ పరారీలో ఉన్నారు

యూపీలో ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు

షాజహాన్‌పూర్‌, నవంబరు 23: షాజహాన్‌పూర్‌ బీజేపీ ఎంపీ అరుణ్‌ కుమార్‌ సాగర్‌ పరారీలో ఉన్నారని ఇక్కడి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తేల్చిచెప్పింది. 2019 ఎన్నికల సమయంలో ఆయన ప్రచార సామగ్రిని అప్పటి ఎస్‌డీఎం సదర్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసు విచారణ కోసం కోర్టు పలుమార్లు సమన్లు ఇచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో ఎంపీ పరారీలో ఉన్నారని తేల్చిన న్యాయస్థానం, ఆయనపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. తమ ఆదేశాలను ఎంపీ నివాసంతోపాటు బహిరంగ ప్రదేశాల్లోనూ అతికించాలని అధికారులను ఆదేశించింది.

Updated Date - 2022-11-24T01:40:11+05:30 IST

Read more