మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు నేత దీపక్‌ అరెస్టు

ABN , First Publish Date - 2022-09-19T07:28:02+05:30 IST

ఝార్ఖండ్‌కు చెందిన మావోయిస్టు నేత దీపక్‌ యాదవ్‌ అలియాస్‌ కరు హులాస్‌ యాదవ్‌(45)ను పోలీసులు అరెస్టు చేశా రు.

మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు నేత దీపక్‌ అరెస్టు

ముంబై, సెప్టెంబరు 18: ఝార్ఖండ్‌కు చెందిన మావోయిస్టు నేత దీపక్‌ యాదవ్‌ అలియాస్‌ కరు హులాస్‌ యాదవ్‌(45)ను పోలీసులు అరెస్టు చేశా రు. ముంబైకి 50 కి.మీ.దూరంలోని పాల్ఘార్‌ జిల్లా నల్లసోపోరాలో ఉండగా, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ‘మోస్ట్‌ వాంటెడ్‌ నక్సల్స్‌’ జాబితాలో ఉన్న ఆయనపై రూ.15 లక్షల రివార్డు ఉంది.

Read more