మరింత క్షీణించిన ములాయం ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-10-03T09:09:40+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యం క్షీణించింది. ఆయన్ను గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి ఐసీయూకు తరలించినట్లు పార్టీ ఆదివారం ప్రకటించింది.

మరింత క్షీణించిన ములాయం ఆరోగ్యం

ఐసీయూకు తరలింపు

గురుగ్రామ్‌/లఖ్‌నవూ, అక్టోబరు 2: ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యం క్షీణించింది. ఆయన్ను గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి ఐసీయూకు తరలించినట్లు పార్టీ ఆదివారం ప్రకటించింది.  కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుంటున్నారని, ఇప్పటికే శివ్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ ఆస్పత్రి వద్ద ఉన్నారని, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఢిల్లీ నుంచి లఖ్‌నవూకు బయలుదేరారని తెలిపింది. ములాయం(82)కు ఆంకాలజిస్టులు చికిత్స అందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 22 నుంచీ ములాయం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించాయి.

Read more