Modi Yogi posters in garbage: పారిశుద్ధ్య కార్మికుడి సస్పెన్షన్ రద్దు...మళ్లీ విధుల్లోకి...

ABN , First Publish Date - 2022-07-20T17:46:38+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రపటాలను చెత్త బండిలో తీసుకువెళ్లినందుకు సస్పెండ్ అయిన పారిశుద్ధ్య కార్మికుడిని...

Modi Yogi posters in garbage: పారిశుద్ధ్య కార్మికుడి సస్పెన్షన్ రద్దు...మళ్లీ విధుల్లోకి...

మధుర(ఉత్తరప్రదేశ్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రపటాలను(Prime Minister Narendra Modi and Uttar Pradesh Chief Minister Yogi Adityanath) చెత్త బండిలో తీసుకువెళ్లినందుకు సస్పెండ్ అయిన పారిశుద్ధ్య కార్మికుడిని(sanitation worker ) తాజాగా విధుల్లోకి తీసుకున్నారు. సస్పెండ్ అయిన పారిశుద్ధ్య కార్మికుడు బాబీ ఖరేకు ఇలాంటి తప్పు పునరావృతం చేయనని ఇచ్చిన హామీతో సస్పెన్షన్ ఉత్తర్వును రద్దు చేశారు. పారిశుద్ధ్య కార్మికుడు బాబీఖరేకు నలుగురు పిల్లలు, అందులో ముగ్గురు ఆడపిల్లలున్నారు.అతని కుటుంబానికి అతనే ఆధారం.దీంతో పాటు మరణించిన అతని సోదరుడి కుటుంబాన్ని కూడా అతను ఆదుకుంటున్నాడు.దీంతో మున్సిపల్ అధికారులు బాబీ ఖరేను విధుల్లోకి తీసుకున్నారు.మధుర(Mathura) మున్సిపాలిటీలో బండిలో చెత్తను సేకరించుకుంటూ వెళుతున్నాడు.చెత్త బండిలో(garbage cart) మోదీ, యోగి చిత్రపటాలు వచ్చాయి.పారిశుద్ధ్య కార్మికుడు చెత్తను సేకరిస్తుండగా పీఎం, సీఎం ఫొటోలు చెత్తతో బండిలోకి వచ్చాయి.


 మథురలోని వాల్మీకి బస్తీలో పెరిగిన నిరక్షరాస్యుడైన బాబీ గత రెండు దశాబ్దాలుగా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు.బాబీ సాధారణంగా రెండు షిఫ్టులలో పనిచేస్తాడు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు చేసే పనికి నెలకు దాదాపు రూ. 20,000 జీతంగా ఇస్తారు.‘‘శనివారం నేను పనిలో ఉండగా ముగ్గురు వ్యక్తులు సుభాష్ ఇంటర్ కాలేజ్ దగ్గర  నా బండిలో ఫొటోలు ఎందుకు ఉన్నాయని అడిగారు...నేను నా పని చేస్తున్నానని వివరించాను.చెత్త సేకరించే స్థలంలో ఇప్పటికే పడి ఉన్న పోస్టర్లను ఇప్పుడే తీసినట్లు నేను వారి దృష్టికి తెచ్చారు.ఉదయం షిఫ్ట్ పూర్తి చేసిన తర్వాత, నన్ను మున్సిపల్ కార్యాలయానికి పిలిపించి షోకాజ్ నోటీసు ఇచ్చారు’’ అని బాబీ చెప్పాడు.


 బాబీ షోకాజ్ నోటీసుకు అదే రోజు బదులిచ్చారు.చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాథ్‌ల ఛాయాచిత్రాలున్న వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో బాబీని సస్పెండ్ చేశారు. అనంతరం మధుర మున్సిపల్ కమిషనర్‌కు జరిగిన దానికి కార్మికుడు బాబీ క్షమాపణలు చెప్పారని, ఆ తర్వాత ఆయనను తిరిగి నియమించామని నగర్ స్వాస్థ్య అధికారి డాక్టర్ కరీం అక్తర్ ఖురేషీ ఖురేషి చెప్పారు.బాబీ క్షమాపణలు కోరుతూ ఒక లేఖను దాఖలు చేశాడు. తాను మళ్లీ తప్పు చేయనని, నిజాయితీతో పని చేస్తానని హామీ ఇచ్చాడు. తన కుటుంబానికి తానే ఏకైక ఆధారమని కూడా పేర్కొన్నాడు. దీని ఆధారంగా బాబీని తిరిగి నియమించారు.మధురలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సంఘటన గురించి వినలేదని ఉత్తరప్రదేశ్ సఫాయి మజ్దూర్ సంఘ్ సభ్యులు అన్నారు.


 


Updated Date - 2022-07-20T17:46:38+05:30 IST