Mobile phone: సెల్లుకు చెల్లు..!

ABN , First Publish Date - 2022-11-25T11:26:16+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలలో మొబైల్‌ ఫోన్ల(Mobile phone) నిషేధానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోం ది. గురువారం బెంగళూరులో విద్యాశాఖా మంత్రి బీసీ

Mobile phone: సెల్లుకు చెల్లు..!

- విద్యాసంస్థల్లో మొబైల్‌ ఫోన్‌ నిషేధానికి ప్రభుత్వం కసరత్తు

బెంగళూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలలో మొబైల్‌ ఫోన్ల(Mobile phone) నిషేధానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోం ది. గురువారం బెంగళూరులో విద్యాశాఖా మంత్రి బీసీ నాగేష్‌ మీడియాతో మాట్లాడుతూ బాల్యంలో మొబైల్‌కు బానిసలుగా మారుతున్నారన్నారు. తరచూ మొబైల్‌ చూడటం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోందన్నారు. అందుకే విద్యాసంస్థలలో మొబైల్‌ వాడకాన్ని నిషేధించదలచామన్నారు. ఇందుకు తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌ కాలంలో ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా మొబైల్‌, ట్యాబ్‌ల వాడకం పెరిగిందన్నారు. అప్పటి నుంచి మొబైల్‌ వాడకానికి పిల్లలు అలవాటు పడ్డారన్నారు. మొబైల్‌ లేకుండా ఉండలేని విధంగా పిల్లలు మారిపోతున్నారని తగ్గించే దిశగానే చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం యథాతథంగా తరగతులు ఉంటాయని కేవలం బ్యాగులు మాత్రం తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు.

Updated Date - 2022-11-25T11:26:20+05:30 IST