Punjab: పాటియాలాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

ABN , First Publish Date - 2022-04-30T23:45:33+05:30 IST

Punjab: పాటియాలాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

Punjab: పాటియాలాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాటియాలా జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు పంజాబ్ సర్కారు తెలిపింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఆపివేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఖలిస్థాన్ అనుకూల ఉద్యమ ప్రయత్నానికి వ్యతిరేకంగా నగరంలో పాదయాత్ర నిర్వహించడంతో కొన్ని గ్రూపుల ప్రజల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పాటియాలా రేంజ్), సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.


Read more