Minister: రూ.13.40 కోట్లతో సబ్‌ వే

ABN , First Publish Date - 2022-10-08T15:55:23+05:30 IST

ఉత్తర చెన్నైలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించే విధంగా రాయపురం(Rayapuram) నియోజకవర్గంలో రూ.13.40 కోట్లతో నిర్మించదలచిన సబ్‌వే

Minister: రూ.13.40 కోట్లతో సబ్‌ వే

ప్యారీస్‌(చెన్నై), అక్టోబరు 7: ఉత్తర చెన్నైలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించే విధంగా రాయపురం(Rayapuram) నియోజకవర్గంలో రూ.13.40 కోట్లతో నిర్మించదలచిన సబ్‌వే శంకుస్థాపన శుక్రవారం జరిగింది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలోని రాయపురం జోన్‌ 52,53 వార్డుల మధ్య భోజరాజనగర్‌, కన్నన్‌ వీధులు కలుపుతూ వాహనాల రాకపోకల కోసం సబ్‌వే నిర్మించాలని నిర్ణయించారు.. శుక్రవారం ఉదయం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో నగరాభివృద్ధి శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ, హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, జీసీసీ మేయర్‌ ఆర్‌.ప్రియ(GCC Mayor R. Priya), కమిషనర్‌ గగన్‌దీప్ సింగ్‌ బేదీ, ఎంపీ కళానిధి వీరాస్వామి, ఎమ్మెల్యే ఐడ్రీమ్‌ మూర్తి, జోనల్‌ కమిటీ చైర్మన్‌ శ్రీరాములు, డిప్యూటీ మేయర్‌ మహే్‌షకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. భోజరాజనగర్‌లో రైల్వే జంక్షన్‌లో రూ.20 కోట్లతో 207 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో సబ్‌వే నిర్మించనున్నారు. 

Updated Date - 2022-10-08T15:55:23+05:30 IST