రూ.30 కోట్లతో వళ్లువర్‌కోట్టం ఆధునికీకరణ

ABN , First Publish Date - 2022-07-09T12:41:24+05:30 IST

స్థానిక వళ్లువర్‌కోట్టంను రూ.30 కోట్ల వ్యయంతో ఆధునీకరించనున్నట్లు సమాచార శాఖ మంత్రి స్వామినాథన్‌ ప్రకటించారు. వళ్లువర్‌కోట్టంను

రూ.30 కోట్లతో వళ్లువర్‌కోట్టం ఆధునికీకరణ

                              - Minister Swaminathan


పెరంబూర్‌(చెన్నై), జూలై 8: స్థానిక వళ్లువర్‌కోట్టంను రూ.30 కోట్ల వ్యయంతో ఆధునీకరించనున్నట్లు సమాచార శాఖ మంత్రి స్వామినాథన్‌ ప్రకటించారు. వళ్లువర్‌కోట్టంను శుక్రవారం ఎమ్మెల్యే ఎళిలన్‌తో కలసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సామినాథన్‌ విలేఖరులతో మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి కలైంజర్‌ రూపొందిన వళ్లువర్‌కోట్టంకు గత ప్రభుత్వాల్లో పర్యవేక్షణ కరువైందన్నారు. ఇటీవల తిరువళ్లువర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌, వళ్లువర్‌కోట్టంను ఆధునీకరించాలని ఆదేశించారని తెలిపారు. సీఎం ఆదేశాలతో వళ్లువర్‌కోట్టంను రూ.30 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో ఆధునీకరించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రజాపనులశాఖ ఆధ్వర్యంలో ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ ప్రాంతంలోని ఆడిటోరియానికి ఏసీ వసతి ఏర్పాటుచేయడంతో పాటు మళ్లీ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. అలాగే, ప్రపంచ సెమ్మొళి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

Read more