ఆలయంలో తప్పులు జరుగుతున్నాయి: మంత్రి

ABN , First Publish Date - 2022-07-08T15:28:47+05:30 IST

కడలూరు జిల్లా చిదంబరం నట రాజస్వామి ఆలయం నిర్వహణలో తప్పులు జరుగు తున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌ బాబు

ఆలయంలో తప్పులు జరుగుతున్నాయి: మంత్రి

అడయార్‌(చెన్నై), జూలై 7: కడలూరు జిల్లా చిదంబరం నట రాజస్వామి ఆలయం నిర్వహణలో తప్పులు జరుగు తున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌ బాబు అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రెట్టమలై శ్రీనివాసన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రులు స్వామినాధన్‌, శేఖర్‌బాబు, మేయర్‌ ప్రియ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శేఖర్‌బాబు మాట్లాడుతూ.. చిదంబరం ఆలయంలో పలు అన్యాయాలు జరుగుతు న్నాయి. ప్రతి ఒక్క విషయాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది. న్యాయ నిపుణులతో చర్చలు జరిపి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. పైగా ఆలయంలో జరిగే తప్పొప్పులపై అనేక ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ తప్పులను మీడియా బహిర్గతం చేయాలని మంత్రి శేఖర్‌ బాబు కోరారు. 

Read more