Minister: గవర్నర్‌ నుంచి సమాచారం లేదు

ABN , First Publish Date - 2022-11-29T10:13:52+05:30 IST

ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టానికి సంబంధించి గవర్నర్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదని న్యాయశాఖ మంత్రి రఘుపతి(Minister Raghupati0 తెలిపారు. నగరంలో

Minister: గవర్నర్‌ నుంచి సమాచారం లేదు

- మంత్రి రఘుపతి

పెరంబూర్‌(చెన్నై), నవంబరు 28: ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టానికి సంబంధించి గవర్నర్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదని న్యాయశాఖ మంత్రి రఘుపతి(Minister Raghupati0 తెలిపారు. నగరంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టానికి సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్రప్రభుత్వం గవర్నర్‌కు పంపించిందన్నారు. 95 శాతం మంది ప్రజలు ఈ క్రీడను నిషేధించాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy)ని ఒకరకమైన వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొందని గుర్తుచేశారు. శాసనసభలో తీర్మానించిన అత్యవసర నిషేధ చట్టానికి సంబంధించి గవర్నర్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదని, భవిష్యత్తులో ఈ క్రీడతో ఏర్పడే నష్టాలకు ఎవరు బాధ్యత అనేది ప్రజల నిర్ణయానికే వదిలేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-11-29T10:13:54+05:30 IST