Minister: నా కుమారుడి పెళ్ళి ఖర్చు రూ.3 కోట్లే...!

ABN , First Publish Date - 2022-10-01T16:26:27+05:30 IST

తన కుమారుడి వివాహానికి రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేశానని, ప్రధాన ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి చెబుతున్నట్లు రూ.30 కోట్లు ఖర్చు

Minister: నా కుమారుడి పెళ్ళి ఖర్చు రూ.3 కోట్లే...!

                                                - మంత్రి మూర్తి  


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 30: తన కుమారుడి వివాహానికి రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేశానని, ప్రధాన ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి చెబుతున్నట్లు రూ.30 కోట్లు ఖర్చు చేయలేదని మంత్రి మూర్తి(Minister Murthy) స్పష్టం చేశారు. కుమారుడి పెళ్ళి వేడుకలకు రూ.3కోట్లు కేటాయించామని, అందులో భోజనాలకు రూ.1.5 కోట్లు  ఖర్చయ్యాయని మంత్రి వివరించారు. ఇటీవల మదురైలో పర్యటించిన మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి, మంత్రి మూర్తి కుమారుడి వివాహానికి రూ.30 కోట్లు ఖర్చుచేశారని ఆరోపిస్తూ, అంత డబ్బు ఆయనకెలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎడప్పాడి ఆరోపణలను మంత్రి ఖండిస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

Read more