Minister: మంత్రి అనితా రాధాకృష్ణన్‌కు షాక్‌

ABN , First Publish Date - 2022-09-18T13:12:21+05:30 IST

అక్రమార్జన కేసులో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌(Minister Anita Radhakrishnan)కు షాక్‌ తగిలింది. ఆయనకు సంబంధించిన

Minister: మంత్రి అనితా రాధాకృష్ణన్‌కు షాక్‌

- రూ.6.5 కోట్లు జప్తు చేసిన ఈడీ

- 2001-2006 నాటి కేసులో అధికారుల చర్యలు


ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 17: అక్రమార్జన కేసులో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌(Minister Anita Radhakrishnan)కు షాక్‌ తగిలింది. ఆయనకు సంబంధించిన రూ.6.5 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) జప్తు చేసింది. అనితా రాధాకృష్ణన్‌ 2001 నుంచి 2006వ సంవత్సరం వరకు అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. జయ మంత్రివర్గంలో సభ్యుడైన ఆయన.. ఆ సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారని, అధికార దుర్వినియోగంతో ఆస్తులు కూడబెట్టుకున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రేగాయి. దీనిపై అప్పట్లోనే కేసు నమోదవ్వగా ఈడీ రంగంలోకి దిగింది. సుదీర్ఘకాలంగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అనంతరం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో, శనివారం అనితా రాధాకృష్ణన్‌ కుటుంబానికి చెందిన రూ.6.5 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. చెన్నైతో పాటు వివిధ ప్రాంతాల్లో వున్న ఆస్తులను జప్తు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా వుండగా ఈ వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అనితా రాధాకృష్ణన్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2022-09-18T13:12:21+05:30 IST