భారతీయుల వీసా ఆలస్యాన్ని తగ్గించండి

ABN , First Publish Date - 2022-11-03T04:42:32+05:30 IST

వీసా జారీలో భారతీయులకు వేచి చూసే సమయాన్ని తగ్గించాలని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీ్‌స (ఎ్‌ఫఐఐడీఎస్‌) అనే ప్రవాస

భారతీయుల వీసా ఆలస్యాన్ని తగ్గించండి

భారత ప్రవాసుల సంస్థ ఎఫ్‌ఐఐడీఎస్‌ విజ్ఞప్తి

వాషింగ్టన్‌ డీసీ, నవంబరు 2: వీసా జారీలో భారతీయులకు వేచి చూసే సమయాన్ని తగ్గించాలని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీ్‌స (ఎ్‌ఫఐఐడీఎస్‌) అనే ప్రవాస భారతీయ సంస్థ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్‌ను ఉద్దేశిస్తూ ఆన్‌లైన్‌ పిటిషన్‌ను ప్రారంభించింది. ‘‘భారత్‌లో వీసా అపాయింట్‌మెంట్లకు ప్రస్తుతం ఉన్న వేచిచూసే సమయాన్ని తగ్గించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ, మంత్రి బ్లింకెన్‌, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం. రెండేళ్ల సుదీర్ఘ సమయం అనంతరం కూడా వేచి చూసే సమయం చాలా తీవ్రంగా ఉండటం ఏమాత్రం సరికాదు. వీసా రకం బట్టి 300 రోజుల నుంచి 900 రోజుల వరకూ ఈ సమయం ఉంటోంది. చైనాలో కేవలం 3 రోజుల్లోనే వీసా జారీ చేస్తున్నారు. అమెరికా ప్రయోజనాలతో పాటు మానవత్వపు కోణాన్నీ దృష్టిలో పెట్టుకుని భారతీయుల వీసాలపై అమెరికా వేగంగా స్పందించాలి. అమెరికాకు ఈ విషయంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని ఎఫ్‌ఐఐడీఎస్‌ తమ పిటిషన్‌లో స్పష్టం చేసింది.

Updated Date - 2022-11-03T04:42:32+05:30 IST
Read more