Milk packet: పాల ప్యాకెట్‌లో ‘ఈగ’

ABN , First Publish Date - 2022-09-22T15:43:24+05:30 IST

మదురైలో విక్రయించిన ఆవిన్‌ పాల ప్యాకెట్‌(Milk packet)లో ఈగ ఉండడం గమనించి వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. మదురై కామరాజ

Milk packet: పాల ప్యాకెట్‌లో ‘ఈగ’

ఐసిఎఫ్‌(చెన్నై), సెప్టెంబరు 21: మదురైలో విక్రయించిన ఆవిన్‌ పాల ప్యాకెట్‌(Milk packet)లో ఈగ ఉండడం గమనించి వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. మదురై కామరాజర్‌ వర్శిటీ సమీపంలో ఉన్న పాల కేంద్రంలో అర లీటరు పాల ప్యాకెట్‌ కొనుగోలు చేసిన మహిళ, ప్యాకెట్‌లో ఈగ తేలుతుండడం గుర్తించి కేంద్రంలో అప్పగించారు. సమాచారం తెలుసుకున్న ఆవిన్‌ అధికారులు అక్కడకు చేరుకొని ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకొని, మహిళ తీసిన వీడియో విడుదల చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు.

Read more