100 అడుగుల దిగువకు Metturu నీటిమట్టం

ABN , First Publish Date - 2022-07-09T13:13:53+05:30 IST

సేలం జిల్లా మేట్టూరు జలాశయంలో నీటిమట్టం 100 అడుగుల (మొత్తం సామర్థ్యం 120 అడుగులు) దిగువకు నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల

100 అడుగుల దిగువకు Metturu నీటిమట్టం

పెరంబూర్‌(చెన్నై), జూలై 8: సేలం జిల్లా మేట్టూరు జలాశయంలో నీటిమట్టం 100 అడుగుల (మొత్తం సామర్థ్యం 120 అడుగులు) దిగువకు నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయానికి గురువారం సాయంత్రం 2,049 ఘనపుటడుగులుగా వస్తున్న నీరు శుక్రవారం ఉదయానికి 2,107 ఘనపుటడుగులకు పెరిగింది. డ్యాంలో చేరుతున్న నీటి కన్నా విడుదల చేస్తున్న నీటి శాతం అధికంగా ఉండడంతో డ్యాం నీటిమట్టం 256 రోజుల అనంతరం 100 అడుగులకు తక్కువగా 99.59 అడుగులకు పడిపోయింది. డ్యాం నుంచి డెల్టా సాగు కోసం 12 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-07-09T13:13:53+05:30 IST