మేల్‌నరియప్పనూర్‌లో పలు Express రైళ్లకు స్టాపింగ్‌

ABN , First Publish Date - 2022-06-07T15:34:17+05:30 IST

కళ్లకుర్చి జిల్లా చిన్నసేలం సమీపం మేల్‌నరియప్పనూర్‌లోని సెయింట్‌ ఆంథోనీ 116వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అక్కడ ఆపనున్నట్లు

మేల్‌నరియప్పనూర్‌లో పలు Express రైళ్లకు స్టాపింగ్‌

చెన్నై, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): కళ్లకుర్చి జిల్లా చిన్నసేలం సమీపం మేల్‌నరియప్పనూర్‌లోని సెయింట్‌ ఆంథోనీ 116వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అక్కడ ఆపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు ఎగ్మూరులో రాత్రి 11.55 గంటలకు బయలుదేరే సేలం ఎక్స్‌ప్రెస్‌ (22153), ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు సేలంలో 9.30 గంటలకు బయలుదేరే ఎగ్మూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22154), ఈ నెల 10వ తేదీ రాత్రి 8.45 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరనున్న పుదుచ్చేరి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (16573), ఈ నెల 11వ తేదీన రాత్రి 11.30 గంటలకు పుదుచ్చేరిలో బయలుదేరనున్న యశ్వంతపూర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (16574), ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు మంగళూరులో బయలుదేరనున్న పుదుచ్చేరి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (16858) మేల్‌నరియప్పనూర్‌ స్టేషన్‌లో ఒక్క నిమిషం ఆగి వెళ్తాయి.

Read more