Measles Outbreak: ముంబయిలో మీజిల్స్ మహమ్మారి...బాలిక మృతి

ABN , First Publish Date - 2022-11-29T11:02:05+05:30 IST

మీజిల్స్ మహమ్మారి ముంబయి నగరంలో వణికిస్తోంది. మహారాష్ట్రలోని ముంబయి నగరంలోని పిల్లలకు మీజిల్స్...

Measles Outbreak: ముంబయిలో మీజిల్స్ మహమ్మారి...బాలిక మృతి
Mumbai Measles Outbreak

ముంబయి(మహారాష్ట్ర): మీజిల్స్ మహమ్మారి ముంబయి నగరంలో వణికిస్తోంది. మహారాష్ట్రలోని ముంబయి నగరంలోని పిల్లలకు మీజిల్స్ (తట్టు వ్యాధి) వ్యాప్తి నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)(Mumbai) అప్రమత్తమైంది.(Measles Outbreak) మీజిల్స్ వ్యాధి ఎక్కువ మంది పిల్లలకు సోకడంతోపాటు మంగళవారం ఈ వ్యాధితో ఏడాది బాలిక(Girl) మరణించిందని బీఎంసీ అధికారులు చెప్పారు. దీంతో ముంబయిలో మీజిల్స్ మరణాల సంఖ్య 14కు పెరిగింది.పిల్లల్లో మీజిల్స్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, పౌరులందరూ 9 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య పిల్లలకు టీకాలు వేయాలని వైద్యాధికారులు సూచించారు.

ఆగ్నేయాసియాలో 90 శాతం మందికి పైగా టీకాలు వేయని పిల్లలకు ఈ వ్యాధి సోకుతోంది. కరోనా, అపోహలు, తప్పుడు సమాచారం కారణంగా టీకా డ్రైవ్‌కు ఆటంకం కలిగిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) తెలిపింది. మీజిల్స్‌తో బాధపడుతున్న 78 మంది కొత్త రోగులు సోమవారం ముంబయిలోని ఆసుపత్రులలో చేరారు. వారిలో 49 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.గురువారం ముంబైలో మొత్తం 22 మీజిల్స్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయని ఒక అధికారి చెప్పారు.

Updated Date - 2022-11-29T11:02:07+05:30 IST