MEA : భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా ప్యానెల్ వ్యాఖ్యలు ఏకపక్షం

ABN , First Publish Date - 2022-07-03T17:25:17+05:30 IST

భారత దేశంలో మత స్వేచ్ఛపై అమెరికాకు చెందిన అంతర్జాతీయ

MEA : భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా ప్యానెల్ వ్యాఖ్యలు ఏకపక్షం

న్యూఢిల్లీ : భారత దేశంలో మత స్వేచ్ఛపై అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (USCIRF) ఏకపక్షంగా, తప్పుడు వ్యాఖ్యలు చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దుయ్యబట్టింది. భారత దేశం గురించి, దాని రాజ్యాంగ నిర్మాణం గురించి, దాని బహుతావాదం, ప్రజాస్వామిక విలువలు, స్వభావం గురించి ఏమాత్రం అవగాహన లేదనే విషయం ఈ వ్యాఖ్యల్లో ప్రతిబింబిస్తోందని పేర్కొంది. 


భారత దేశంలో విమర్శించే గళాలను అణగదొక్కుతున్నారని, ముఖ్యంగా మతపరమైన అల్ప సంఖ్యాకులను, వారి కోసం పని చేస్తున్నవారిని అణచివేస్తున్నారని USCIRF శుక్రవారం వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి శనివారం స్పందిస్తూ, భారత దేశంపై USCIRF చేసిన ఏకపక్ష, తప్పుడు వ్యాఖ్యలను గమనించినట్లు తెలిపారు. భారత దేశం గురించి, దాని రాజ్యాంగ నిర్మాణం గురించి, దాని బహుతావాదం, ప్రజాస్వామిక విలువలు, స్వభావం గురించి ఈ ప్యానెల్‌కు ఏమాత్రం అవగాహన లేదనే విషయం ఈ వ్యాఖ్యల్లో ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్యానెల్ తన ప్రేరేపిత ఎజెండాకు అనుగుణంగా పదే పదే తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు కేవలం ఈ సంస్థ విశ్వసనీయత, నిష్పాక్షికతలపై ఆందోళన బలపడటానికి మాత్రమే ఉపయోగపడతాయన్నారు. 


Updated Date - 2022-07-03T17:25:17+05:30 IST