మే రెండో వారంలో అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం!

ABN , First Publish Date - 2022-04-24T13:22:55+05:30 IST

అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలోని విభాగం నుంచి జిల్లా స్థాయి విభాగాలకు ఈ సంస్థాగత

మే రెండో వారంలో అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం!

అడయార్‌(చెన్నై): అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలోని విభాగం నుంచి జిల్లా స్థాయి విభాగాలకు ఈ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా సోమవారం 38 జిల్లాల్లోని అన్ని విభాగాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సర్వసభ్య సమావేశం వచ్చే నెల రెండో వారంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలోని అన్ని విభాగాలకు ఎన్నికలు జరిగిన తర్వాత ఈ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో దాదాపు వెయ్యిమందికిపైగా సభ్యులు పాల్గొననున్నారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు మే 10వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత ఈ జనరల్‌ బాడీ మీటింగ్‌ను నిర్వహించాలని పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి భావిస్తున్నారు. ఇందులో 2024లో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు రాష్ట్రంలోని పలు సమస్యలపై చర్చించనున్నారు. 

Read more