పెళ్లికి వెళ్లొస్తూ మృత్యులోయలోకి!

ABN , First Publish Date - 2022-02-23T07:58:46+05:30 IST

14 మంది మృతి డెహ్రాడూన్‌, ఫిబ్రవరి 22: ఉత్తరాఖండ్‌లో పెళ్లికి వెళ్లివస్తున్న వారి వాహనం లోయలోపడి 14మంది కన్నుమూశారు...

పెళ్లికి వెళ్లొస్తూ మృత్యులోయలోకి!

లోయలో పడిపోయిన వాహనం..

14 మంది మృతి  డెహ్రాడూన్‌, ఫిబ్రవరి 22: ఉత్తరాఖండ్‌లో పెళ్లికి వెళ్లివస్తున్న వారి వాహనం లోయలోపడి 14మంది కన్నుమూశారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చంపావత్‌ జిల్లాలోని సుఖిధాంగ్‌-దండమినార్‌ రహదారిపై ఈ ఘోరం జరిగింది. మొత్తం 12 మృతదేహాలను ప్రమాద స్థలం నుంచి వెలికితీశారు. మరో రెండు తీయాల్సి ఉందని అధికారులు తెలిపారు. వీరంతా సమీప తనక్‌పుర్‌లో జరిగిన ఓ వివాహానికి హాజరై.. తిరిగి దండా కక్నాయ్‌ గ్రామానికి పికప్‌ ట్రక్‌ వంటి వాహనంలో తిరిగి వస్తున్నారని వివరించారు. 

Read more