ఆర్మీలో తొలి మహిళా స్కై డైవర్‌గా మంజు రికార్డు

ABN , First Publish Date - 2022-11-19T02:21:17+05:30 IST

సైన్యంలో మొదటి మహిళా స్కై డైవర్‌గా లాన్స్‌ నాయక్‌ మంజు రికార్డు సృష్టించారు. 10వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న తేలికపాటి హెలికాప్టర్‌ ధ్రువ్‌ నుంచి డైవింగ్‌ ..

ఆర్మీలో తొలి మహిళా స్కై డైవర్‌గా మంజు రికార్డు

10వేల అడుగుల ఎత్తు నుంచి డైవింగ్‌

న్యూఢిల్లీ, నవంబరు 18: సైన్యంలో మొదటి మహిళా స్కై డైవర్‌గా లాన్స్‌ నాయక్‌ మంజు రికార్డు సృష్టించారు. 10వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న తేలికపాటి హెలికాప్టర్‌ ధ్రువ్‌ నుంచి డైవింగ్‌ చేయడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు. దీనిపై ఆర్మీ ఈస్ట్రన్‌ కమాండ్‌ స్పందిస్తూ మహిళా జవాన్లకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొంది. రికార్డు సృష్టించిన అనంతరం మంజు మాట్లాడుతూ యువత తమ కలలను నిజం చేసుకోవడానికి ఎంత గట్టిగా ప్రయత్నిస్తారనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందని తెలిపారు.

Updated Date - 2022-11-19T02:21:17+05:30 IST

Read more