కంపెనీకి రూ.50 లక్షలు టోకరా వేసిన ఉద్యోగి అరెస్టు

ABN , First Publish Date - 2022-07-29T19:54:23+05:30 IST

పని చేస్తున్న కంపెనీ నుంచి రూ.50 లక్షలు అహపరించిన ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల యువకుడిని..

కంపెనీకి రూ.50 లక్షలు టోకరా వేసిన ఉద్యోగి అరెస్టు

నొయిడా: పని చేస్తున్న కంపెనీ నుంచి రూ.50 లక్షలు అహపరించిన ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల యువకుడిని నొయిడా పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ ఢిల్లీలోని వినోద్ నగర్ ఏరియాలో నివసిస్తున్న పునీత్ శ్రీవాత్సవను సెక్టార్ 15 మెట్రో స్టేషన్ వద్ద అరెస్టు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.


''పునీత్ శ్రీవాత్సవ ఏసీఏఏసీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పని చేస్తున్నాడు. కంపెనీ నుంచి రూ.50 లక్షల రూపాయలను సొంత బ్యాంక్ అకౌంట్‌కు, అతని బంధువుల అకౌంట్‌కు నిందితుడు ట్రాన్స్‌పర్ చేసినట్టు ఫేజ్ 1 పోలీస్ స్టేషన్‌లో కంపెనీ ఫిర్యాదు చేసింది'' అని పోలీసు ప్రతినిధి ఒకరు చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టామని, అనంతరం నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. నిధులు ఏయే బ్యాంకు అకౌంట్లకు బదిలీ అయ్యాయో ఆ బ్యాంక్ అకౌంట్లను స్తంభిపజేశామని, శ్రీవాత్సవ పేరుతో ఉన్న హెచ్‌ఎఫ్‌డీసీ  బ్యాంకు అకౌంట్లో రూ.10 లక్షలు ఉన్నట్టు గుర్తించామని అన్నారు. ఐపీసీలోని సెక్షన్ 420 (మోసం), 408 (విశ్వాసరాహిత్యం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పారు. నిందితుడుని స్థానిక కోర్టు ముందు హాజరుపరచగా, జ్యూడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది.

Updated Date - 2022-07-29T19:54:23+05:30 IST