దోషిగా తేలితే జీవితఖైదు విధించండి: పార్థా చటర్జీ అవినీతిపై మమత

ABN , First Publish Date - 2022-07-25T23:48:42+05:30 IST

కోల్‌కతా: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాల్లో దాదాపు 21 కోట్ల రూపాయలతో అడ్డంగా దొరికిపోయిన

దోషిగా తేలితే జీవితఖైదు విధించండి: పార్థా చటర్జీ అవినీతిపై మమత

కోల్‌కతా: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణానికి (teacher recruitment scam) సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (enforcement directorate) సోదాల్లో దాదాపు 21 కోట్ల రూపాయలతో  అడ్డంగా దొరికిపోయిన రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీ (partha chatterjee)పై సీఎం మమతాబెనర్జీ (mamata banerjee) కన్నెర్ర చేశారు. మంత్రి అరెస్టైన రెండు రోజుల తర్వాత ఆమె తొలిసారి స్పందించారు. పార్థా ఛటర్జీ దోషిగా తేలితే జీవితఖైదు విధించినా తనకు అభ్యంతరం లేదన్నారు. అందరూ ఒకేలా ఉండరన్న మమత, తానెప్పుడూ అవినీతిని సమర్థించబోనని చెప్పారు. వీలైనంత త్వరగా నిజం నిగ్గు తేలాలన్నారు. మంత్రి పార్థా ఛటర్జీ సహాయకురాలు, నటి, మోడల్ అర్పితా ముఖర్జీ (arpitha mukherjee) ఇంట్లో రూ.21 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకొంది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ గతంలో విద్యామంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరిగింది. 
ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ అర్పితా ముఖర్జీతో ఎలాంటి సంబంధాలు లేవని మమత స్పష్టం చేశారు. తాను గతంలో దుర్గా పండాల్‌ను సందర్శించినప్పుడు ఒక మహిళను పార్థా చటర్జీ స్నేహితురాలని చెప్పి పరిచయం చేశారని మమత గుర్తు చేసుకున్నారు. తానేమీ దేవతను కాదని, ఎవరి స్నేహితులు ఎలాంటి వారో తనకెలా తెలుస్తుందని మమత ప్రశ్నించారు.


మరోవైపు పార్థా ఛటర్జీని ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని కోల్‌కతా ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది.  

Read more