మజాల సెంటర్‌ తిహార్‌.. మాజీ ఉద్యోగి ఆరోపణ

ABN , First Publish Date - 2022-11-25T04:01:53+05:30 IST

మసాజ్‌లనే కాదు అన్నిరకాల మజాలను తిహార్‌ జైలులో అనుమతిస్తారంటూ ఆ జైలు మాజీ అధికారి సునీల్‌ గుప్తా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తిహార్‌లో వీఐపీ

మజాల సెంటర్‌ తిహార్‌.. మాజీ ఉద్యోగి ఆరోపణ

న్యూఢిల్లీ, నవంబరు 24: మసాజ్‌లనే కాదు అన్నిరకాల మజాలను తిహార్‌ జైలులో అనుమతిస్తారంటూ ఆ జైలు మాజీ అధికారి సునీల్‌ గుప్తా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తిహార్‌లో వీఐపీ ఖైదీలకు రాచమర్యాదలు జరుగుతాయని, చివరికి సెక్స్‌ అవసరాలను కూడా సెల్‌లోనే తీర్చుకోవచ్చునని ఆయన కుండబద్దలు కొట్టారు. ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తన సెల్‌ను మసాజ్‌ సెంటర్‌గా మార్చడం, బయట నుంచి ఆహారం తెప్పించుకుంటున్న వీడియోలు విడుదలై తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుప్తా చెబుతున్న విషయాలు మరింత సంచలనం రేపుతున్నాయి. గుప్తా 1981 నుంచి 2016 వరకు తిహార్‌లో పనిచేసినట్టు చెబుతున్నారు. గుప్తా వ్యాఖ్యలపై స్పందించేందుకు జైలు అధికార ప్రతినిధి ధీరజ్‌ మాథూర్‌ నిరాకరించగా, ఈ విషయాలు తాను తిహార్‌కు రావడానికి ముందుగానీ, ఆ తర్వాతగానీ జరిగి ఉంటాయని మాజీ బాస్‌ కిరణ్‌ బేదీ తెలిపారు.

Updated Date - 2022-11-25T04:01:53+05:30 IST

Read more